జర్నలిస్ట్ రాజన్ బాల మృతి బెంగళూరు : ప్రముఖ క్రికెట్ పాత్రికేయుడు రాజన్ బాల (63) గుండెపోటుతో శుక్రవారం బెంగళూరులో మరణించారు. రెండు వారాల క్రితం బెంగళూరులో ఒక టివి చానెల్ స్టూడియోస్ లో ఒక షో నిర్వహిస్తుండగా రాజన్ బాల గుండెపోటుకు గురయ్యారు. ఆయన అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు.
సచిన్ టెండూల్కర్, బి.ఎస్. చంద్రశేఖర్ జీవిత చరిత్రలతో సహా క్రికెట్ పై పలు గ్రంథాలను రాజన్ బాల రచించారు. బెంగళూరును తన కేంద్రంగా చేసుకున్న రాజన్ బాల ది స్టేట్స్ మన్, ది హిందూ, డక్కన్ హెరాల్డ్, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఏషియన్ ఏజ్ పత్రికలకు విలేఖరిగా పని చేశారు.
News Posted: 9 October, 2009
|