ఐపిఎల్ బరిలో మోహన్ లాల్? ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రథంలోకి దూకడానికి మరి కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐపిఎల్ దండిగా లాభాలు ఆర్జించిపెట్టేదిగా రుజువు కావడంతో చాలా మంది నటులు జట్లకు సహ యజమానులుగా ఉండడానికి సిద్ధపడుతున్నారు. ఈ విధంగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి వారు ఉద్యుక్తులవుతున్నారు. అంటే దేశంలోని రెండు పెద్ద మతాలు - క్రికెట్, చిత్రాలు బంతి, బ్యాట్ ప్రపంచంలో కలగలసిపోతున్నాయన్నమాట.
'ఆల్ ది బెస్ట్' చిత్రం షూటింగ్ సమయంలో ఆప్తమిత్రులుగా మారిపోయిన నటులు అజయ్ దేవగణ్, సంజయ్ దత్ ఐపిఎల్ జట్లలో ఒకదానిని కొనుగోలు చేయాలనే ఆసక్తితో ఉన్నట్లు విదితమే. ఐపిఎల్ చైర్మన్ లలిత్ మోడితో వారి సమావేశం అనేకమందికి చర్చనీయం అయింది కూడా.
ఇప్పుడు సినీ దర్శక నిర్మాత ప్రియదర్శన్ నటులు మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లతో పాటు ఐపిఎల్ రథాన్ని అధిరోహించాలని అమితాసక్తి కనబరుస్తున్నట్లు వినికిడి. వారు ముగ్గురూ ఇప్పటికి వారం రోజులుగా ఐపిఎల్ చైర్మన్ మోడితో చర్చలు సాగిస్తున్నారు. 'నేను ఐపిఎల్ సమావేశాలతో బిజీగా ఉన్నాను' అని ప్రియదర్శన్ 'ఇండియాటైమ్స్ మూవీస్' విలేఖరితో చెప్పారు. 'అయితే, అంతా బిడ్ లపై ఆధారపడి ఉంటుంది. పరిస్థితి మాకు అనుకూలంగా ఉండగలదని మా ఆశ. కాని క్రికెట్ వలె ఇది కూడా ఎలా పరిణమిస్తుందో ఎవరికీ తెలియదు' అని ప్రియదర్శన్ చెప్పారు.
మరి ఏ జట్టును ఎవరు సొంతం చేసుకుంటారనేది వారు వేసే బిడ్ లే తేలుస్తాయి.
News Posted: 13 October, 2009
|