కెప్టెన్సీకి యూనిస్ రాజీనామా ఇస్లామాబాద్ : మొన్నటి చాంపియన్స్ ట్రోఫీలో ఓటములు యూనిస్ ఖాన్ కెప్టన్ పదకి ఎసరు పెట్టాయి. దేశ పరిపాలన స్థాయి సంఘం(క్రీడలు) గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో విసుగెత్తిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు నాయకుడు యూనిస్ ఖాన్ తన కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. రాబోయే ఆసిస్, కివిస్ పర్యటనలకు తాను అందుబాటులో ఉండబోవడం లేదని స్పష్టం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో క్రీడల సంఘం కెప్టెన్ యూనిస్ ఖాన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్టు చైర్మన్ ఇజాజ్ భట్, కోచ్ ఇంతికాబ్ ఆలం, మేనేజర్ యావర్ సయీద్ ను వివరణలు అడిగింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో మ్యాచ్ లు ఓడిపోవడానకి గల కారణాలను తెలపాలని కోరింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యూనిస్ రాజీనామాను ఆమోదించిందీ లేనిదీ ఇంకా తేలలేదు కాని టెలివిజన్ చానళ్ళు మాత్రం రాజీనామాను తిరస్కరించినట్లు పేర్కొన్నాయి. పార్లమెంట్ సభ్యులు జట్టు అపజయాలపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. క్రికెట్ వర్గాలు మాత్రం
ఓటిమికి జట్టు సభ్యులు బాధ్యులు కాదని, అదంతా ఆటలో భాగమేనని, ఆ మ్యాచ్ ల్లో పాకిస్తాన్ కు కలిసిరాలేదని చెబుతున్నాయి. ఈమేరకు పార్లమెంటుసభ్యులను శాంతింపచేయడానికి కృషి చేస్తున్నాయి.
News Posted: 14 October, 2009
|