ఛార్జర్స్ పరాజయం హైదరాబాద్ : హోరాహోరీగా సాగుతున్న ఛాంపియన్స్ లీగ్ నుంచి హైదరాబాద్ జట్టు డక్కన్ ఛార్జర్స్ నిష్క్రమించింది. ఐపీఎల్ ఛాంపియన్ తన విజయపరంపరను కొనసాగించలేక చతికిల పడింది. తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో విజయానికి కేవలం మూడు పరుగుల దూరంలో కుప్పకూలిపోయింది. ట్రానిడాడ్ అండ్ టొబాగొ తో బుధవారం జరిగిన కీలక మ్యాచ్ తో గిల్లీ సేన లీగ్ నుంచి గల్లంతయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రానిడాడ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత డెక్కన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 146 పరుగుల కే ఆలౌట్ అయింది.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెక్కన్ ఆరంభం లోనే వరస వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ గిల్‌క్రిస్ట్ తొలి బంతినే థర్డ్‌మ్యాచ్ దిశలో సిక్స్ కొట్టాడు. ఐతే లక్ష్మణ్ (4)తన తొలి బంతిని ఫోర్ కొట్టినా బ్రావోకు వికెట్ల ముందు దొరికిపోయాడు. కొద్దిసేపటికే అభినవ్ (1) కీపర్ రామ్‌దిన్‌కు క్యా చ్ ఇచ్చాడు. స్కోరుబోర్డుకు 3 పరుగులు చేరగానే సైమండ్స్ (2) లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యా డు. దాంతో ఛార్జర్స్ 30కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు పడుతున్న రోహిత్ శర్మ అండతో గిల్‌క్రిస్ట్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. బౌండరీలు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో గిల్లీ కేవలం 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కొద్దిసేపటికే గిల్లీ (51: 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) సిమన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పొలార్డ్ అద్భుత క్యాచ్‌తో ఔట్ అయ్యాడు. ఆ వెంటనే రోహిత్ (25) కూడా నిష్ర్కమించాడు. చివర్లో వేణు (30: 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించిన ఫలితం దక్కలేదు. చివరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా కేవలం నాలుగు మాత్రమే చేసి 3 పరుగులతో డెక్కెన్ పరాజయం పొందింది.
అంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.తుది జట్టులో లోకల్‌బాయ్ అభినవ్ కుమార్‌కు స్థానం దక్కింది. ట్రానిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్‌ను సిమన్స్-పెర్కిన్స్ ఆరంభిం చారు. ఎడ్వర్డ్‌స వేసిన తొలి ఓవర్‌లోనే పెర్కిన్స్ రెండు బౌండరీలు బాదాడు. ఐతే ఎడ్వర్డ్‌స తన రెండో ఓవర్‌లో సిమన్స్ (7)ను ఎల్బీగా ఔట్ చేశాడు. డారెన్ బ్రావోతో కలిసి పెర్కిన్స్ స్కోరుబోర్డును ముందు కు నడిపించాడు. ఆ తర్వాత డెక్కన్ బౌలర్లు గతి తప్పిన బంతులు వేయడంతో తొలి 5 ఓవర్లలోనే ట్రానిడాడ్ 50 పరుగులకు చేరింది.అయితే చివరకు ట్రానిడాడ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
News Posted: 14 October, 2009
|