ద్రావిడ్, పఠాన్ అవుట్ న్యూఢిల్లీ : టీమిండియా జట్టులో ఓపెనర్ రాహుల్ ద్రావిడ్ కు స్థానం దక్కలేదు. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే వన్డే సీరీస్ తొలి రెండు వన్డేలలో ఆడేందుకు ద్రావిడ్ కు స్థానం దక్కలేదు. ద్రావిడ్ తో పాటు యూసుఫ్ పఠాన్, ఆర్పీ సింగ్, దినేష్ కార్తీక్ లను జట్టులోకి తీసుకోలేదు. ఈ నెల 25 నుంచి ఆస్ట్రేలియా - భారత జట్ల మధ్య ప్రారంభం కానున్న వన్డే సీరీస్ కు భారత జట్టును గురువారం ఇక్కడ ప్రకటించారు. ఈ నెల 25 న వడోదరలో ప్రారంభమయ్యే 7 వన్డేల సీరీస్ నవంబర్ 11న ముంబాయిలో జరిగే చివరి మ్యాచ్ తో ముగుస్తుంది. కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్వంలోని జాతీయ ఎంపిక కమిటీ గురువారం చెన్నైలో సమావేశమై టీమిండియా జట్టును ఖరారు చేసింది. పదిహేను మంది సభ్యులున్న టీమిండియా జట్టును గురువారం ఇక్కడ బిసిసిఐ ప్రకటించింది.
కాగా, గాయాల బారిన పడి కోలుకున్న ఓపెనర్ వీందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లకు మళ్ళీ జట్టులో స్థానం కల్పించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన పేసర్ సందీప్ త్యాగిని కొత్తగా జట్టులోకి తీసుకున్నారు. టీమిండియా స్పిన్నర్లలో హర్భజన్ సింగ్ తొలి ప్రాధాన్యతలో జట్టుకు ఎంపికయ్యాడు.
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించువాల్సిన కారణంగా ఇంగ్లండ్ లో జరిగిన 'ట్వంటీ - 20 ప్రపంచ కప్'కు, దక్షిణాఫ్రికాలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీకీ సెహ్వాగ్ దూరంగా ఉన్నాడు.
టీమిండియా జట్టు సభ్యులు : మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, విరాట్ కోహ్లీ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఆశిష్ నెహ్రా, సుదీప్ త్యాగి, సురేష్ రైనా.
News Posted: 15 October, 2009
|