కోచ్ లపై బిసిసిఐ వేటు న్యూఢిల్లీ : క్రీడాకారులకు క్రికెట్ లో సరైన శిక్షణ ఇవ్వడంతో విఫలమయ్యారంటూ టీమిండియా బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్, ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ లను బిసిసిఐ గురువారం బాధ్యతల నుంచి తొలగించింది. వీరి తొలగింపు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బిసిసిఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియా జట్టుతో జరగనున్న వన్డే సీరీస్ కు టీమిండియా క్రీడాకారులను వెల్లడించిన వెంటనే బిసిసిఐ కోచ్ లు ఇద్దరినీ తొలగిస్తున్నట్లు మీడియాకు ప్రకటన విడుదల చేయడం గమనార్హం. భారత క్రీడాకారులకు ఈ కోచ్ లిద్దరూ సరిగా శిక్షణ ఇవ్వడం లేదంటూ బిసిసిఐ అసంతృప్తి వ్యక్తం చేసిందని బిసిసిఐ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో టీమిండియా పోటీల్లో సరైన ప్రతిభను కనబరచలేకపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకటేశ్ ప్రసాద్, రాబిన్ సింగ్ లను తొలగిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది.
News Posted: 15 October, 2009
|