టీమ్ ఇండియాకు అగ్నిపరీక్ష గౌహతి : గౌహతిలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న ఆరవ ఒడిఐ క్రికెట్ మ్యాచ్ టీమ్ ఇండియాకు అగ్ని పరీక్ష కాగలదు. ఈ గేములో ఏమాత్రం తడబడినా సీరీస్ ఆసీస్ జట్టు వశం అవుతుందనే సంగతి భారత జట్టుకు తెలుసు. ఏడు మ్యాచ్ ల ఒడిఐ సీరీస్ లో ఆసీస్ జట్టు 3-2తో ఆధిక్యంలో ఉండడంతో ఆదివారం పోటీని గెలవడం తప్ప ఇండియాకు మార్గాంతరం లేదు. ప్రపంచ క్రికెట్ లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భారత జట్టు ఆకాంక్షిస్తున్న పక్షంలో పట్టుదలతో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రీడాకారులపై ఆదివారం గౌహతిలోను, ఆతరువాత ముంబైలోను విజయం సాధించవలసి ఉంటుంది. అయితే, మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు ఇదేమీ తేలిక వ్యవహారం కాదు. జట్టు ఇప్పటికే ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటుండడం ఇందుకు కారణం. గౌహతిలో జరిగేది డే మ్యాచ కాగా ముంబైలో తిరిగి డే నైట్ మ్యాచ్ జరుగుతుంది.
News Posted: 7 November, 2009
|