గౌహతి : అత్యంత కీలకమైన ఆరో వన్డే మ్యాట్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఏడు వన్డేల సీరీస్ ను గెలవాలంటే ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి తీరాలి. లేకపోతే సీరీస్ చేజారిపోతుంది. చివరి వన్డే నామమాత్రమవుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లన గెలిచిన ఆస్ట్రేలియా ఆధిపత్యంలో ఉంది. ఈ మ్యాచ్ ను భారత్ గెలిస్తా సీరీస్ 3-3తో సమం అయి ఆఖరి ఏడో మ్యాచ్ రసపట్టులో పడుతుంది. ఇక్కడ జవహర్ లాల్ స్టేడియంలో మ్యాచ్ 8.30 నిముషాలకుప్రారంభం కానుంది.