దిగజారిన టీమిండియా ముంబయి : ప్రపంచ నంబర్ వన్ స్థానంలో వెలిగిపోవలసిన టీమిండియా దిగజారిపోయింది. ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై ఏడు వన్డేల సీరీస్ ప్రారంభించేటప్పుడు టీమిండియా నంబర్ వన్ స్థానం దక్కించుకోడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఏ నాలుగు మ్యాచ్ లు గెలిచినా సీరీస్ తో పాటు ఐసిసి ర్యాంకింగ్ లో ఖాయమైన మొదటిస్థానం కైవసం అయ్యేది. ఇక్కడ జరగాల్సిన ఆఖరి వన్డే ఫైయాన్ దెబ్బకు రద్దయిపోవడంతో భారత్ మూడో స్థానంలోకి పడిపోయింది. గాయాలతో సతమతమవుతూ మ్యాచ్ మ్యాచ్ కు స్టార్ ఆటగాళ్లను స్వదేశానికి పంపేసిన ఆస్ట్రేలియా బలహీన పడినా, వచ్చిన అవకాశాన్న ధోనీ సేన సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండు మ్యాచ్ లు వరసగా గెలిచి అదే విజయమని సంబరపడిపోయింది. రెండు మ్యాచ్ లో విజయం అంచులకు వచ్చి చేతులెత్తేసి సీరీస్ ను అప్పగించేయడమే కాదు, ప్రపంచ ర్యాంకింగ్ ను కూడా పోగొట్టుకుంది.
News Posted: 11 November, 2009
|