క్రికెటర్లూ! నైటవుట్లు వద్దు కాన్పూర్ : చెప్పాపెట్టకుండా రాత్రుళ్ళు బయటకు చెక్కేసే క్రికెట్ వీరులపై బిసిసిఐ కన్నెర్ర చేసింది. శ్రీలంక టెస్ట్ మ్యాచ్ ల సమయంలో రాత్రి విహారాలు కట్టిపెట్టాలని మన స్టార్ ప్లేయర్లను హెచ్చరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆటగాళ్లు బయటకు పోరాదని స్పష్టం చేసింది. అంతేగాని రాత్రి పూటల్లో 'ఫుల్లుగా' తిరిగేసి మర్నాడు నిద్రపోవడానికి వెంటవెంటనే అవుటై డ్రస్సింగ్ రూమ్ కు వచ్చేస్తున్నారని మాత్రం కాదు. కాన్పూర్ లో 24 నుంచి జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ ఏర్పాట్లను పర్యవేక్షించడానకి ఇక్కడకు వచ్చిన బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ఆటగాళ్లు ఇష్టం వచ్చినట్లు రాత్రి వేళల్లో బయటకు పోతున్నారని, భద్రతను గాలికొదిలేయడం తమను ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. సంబంధిత అధికారులకు చెప్పాకుండా ఆటగాళ్ళు తమ బసలను వదిలిపోకుండా జాగ్రత్త పడాలని టీం మేనేజ్ మెంట్ కు చెప్పామని ఆయన వివరించారు.
News Posted: 16 November, 2009
|