భారత్ 426 ఆలౌట్ అహ్మదాబాద్ : శ్రీలంకతో ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజున భారత్ 426 పరుగులకు ఆలౌట్ అయింది. 177 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్ భారత స్కోర్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు. 110 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రెండో స్థానంలో ఉన్నాడు. యువరాజ్ సింగ్ 68 పరుగులు చేశాడు. గౌతం గంభీర్ 1, వీరేంద్ర సెహ్వాగ్ 16, సచిన్ టెండుల్కర్ 4, వివిఎస్ లక్ష్మణ్ 0, హర్భజన్ సింగ్ 22, జహీర్ ఖాన్ 12, ఇషాంత్ శర్మ పరుగులేవీ చేయకుండా అవుట్ కాగా, అమిత్ మిశ్రా 7 పరుగులు చేసి నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
శ్రీలంక బౌలర్లలో చణక వెలెగెదర 87 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 97 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. దమ్మిక ప్రసాద్ 2, రంగన హెరాత్ 1 వికెట్ పడగొట్టారు.
కాగా, మధ్యాహ్న భోజన విరామానికి శ్రీలంక ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 37 పరుగులు చేసింది. శ్రీలంక ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ తిలకరత్నె దిల్షాన్ 18, తరంగ పరణవితన్ 18 పరుగులతో క్రీజ్ వద్ద ఉన్నారు.
News Posted: 17 November, 2009
|