జయవర్దనె డబుల్ సెంచరీ అహ్మదాబాద్ : టీమిండియాతో ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె డబుల్ సెంచరీ చేశాడు. ఆట మూడవరోజు బుధవారం తమ తొలి ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు. మొత్తం 330 బంతులు ఎదుర్కొన్న జయవర్దనె ఒక సిక్సర్, 17 బౌండరీల సాయంతో ఈ డబుల్ సెంచరీని పూర్తిచేశాడు. జయవర్దనె క్రికెట్ కెరీర్ ఇది ఆరో డబుల్ సెంచరీ. టెస్ట్ మ్యాచ్ లలో జయవర్దనె అత్యుత్తమ స్కోరు 374 పరుగులు ఉంది. మొత్తం 27 సెంచరీలు సాధించిన జయవర్దనె స్కోర్ కార్డులో 12 సార్లు 150 పరుగులు చేసినవే కావడం విశేషం.
కాగా, తొలి మ్యాచ్ పై శ్రీలంక జట్టు పట్టు సాధిస్తున్నది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు భారత్ పై 165 పరుగుల ఆధిక్యంలో ఉంది. 160 ఓవర్లు ఎదుర్కొన్న శ్రీలంక జట్టు ఐదు వికెట్ల నష్టానికి 591 పరుగులు చేసింది. డబుల్ సెంచరీ చేసిన మహేల జయవర్దనె 204 పరుగులతోను, పి.జయవర్దనె 84 పరుగులతోనూ ఆడుతూ నైట్ వాచ్ మెన్ గా ఉన్నారు. జట్టు ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ 112, తరంగ పరణవితన్ 35, కెప్టెన్ కుమార సంగక్కర 31, తిలన్ సమరవీర 70, ఏంజెలో మాథ్యూస్ 17 పరుగులు చేశారు. శ్రీలంక జట్టు బ్యాట్స్ మెన నిలకడగా ఆడుతూ తమ జట్టును ఆధిక్యంలోకి తీసుకువెళ్ళారు. శ్రీలంక జట్టులో ఇద్దరు సెంచరీలు చేశారు. శ్రీలంక బ్యాట్స్ మెన్ ను అవుటే చేయడానికి భారత బౌలర్లు, ఫీల్డర్లు చెమటోడ్సాల్సి వస్తోంది. వికెట్ల వద్ద పాతుకుపోయిన బ్యాట్స్ మెన్ పై వారు ఎలాంటి ప్రభావాన్నీ చూపించలేకపోతున్నారు. భారత బౌలింగ్ లో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్భజన్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
News Posted: 18 November, 2009
|