శ్రీలంక 760\7 డిక్లేర్డ్ అహ్మదాబాద్ : ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో తన తొలి ఇన్నింగ్స్ ను శ్రీలంక జట్టు 760 పరుగులకు డిక్లేర్ చేసింది. నాలుగో రోజు గురువారం భోజన విరామ సమయానికి 708 పరుగులు సాధించిన శ్రీలంక మరో 52 పరుగులు జోడించి తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీనితో శ్రీలంక 334 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. ధోనీ సేనను రెండో ఇన్సింగ్స్ ఆడాల్సిందిగా ఆహ్వానించింది. శ్రీలంక ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ 112 పరుగులు, మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె 275 పరుగులు, ప్రసన్న జయవర్దనె 154 నాటౌట్ పరుగులు చేశారు.
మూడో శతకానికి చేరువవుతున్న మహేల జయవర్దెనెను ఎట్టకేలకు శ్రమించి, చెమటోడ్చి అవుట్ చేయడం నాలుగో రోజు ఆటలో భారత్ తరఫున విశేషంగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 426 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మహేల జయవర్దనెను అమిత్ మిశ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దమ్మిక ప్రసాద్ వ్యక్తిగత స్కోర్ 21 పరుగుల వద్ద హర్భజన్ సింగ్ పెవిలియన్ కు పంపించాడు. ప్రసాద్ అవుటైన వెంటనే శ్రీలంక ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
News Posted: 19 November, 2009
|