సచిన్ సరికొత్త రికార్డు

అహ్మదాబాద్ : భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన ఖాతాలో మరో సరికొత్త రికార్డును జమచేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇంతవరకూ మరే ఆటగాడూ చేయనన్ని 30,000 పరుగుల మైలురాయిని సచిన్ చేరుకున్నాడు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 35 పరుగులు చేయడం ద్వారా సచిన్ ఈ రికార్డు చేశాడు. దీనితో సచిన్ పేరిట మరో కొత్త రికార్డు లిఖించుకున్నట్లైంది. ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో సచిన్ కొత్త రికార్డుకు వేదికగా నిలిచింది. శ్రీలంక జట్టు భారత పర్యటనలో భాగంగా నిర్వహిస్తున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లోని తొలి మ్యాచ్ ఐదవ రోజు శుక్రవారంనాడు సచిన్ ఈ రికార్డు చేశాడు.
News Posted: 20 November, 2009
|