అజర్ విముక్తికి పైరవీ న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెట్ కెప్టెన్, ఎంపీ అజాహారుద్దీన్ పై బీసీసీఐ విధించిన జివితకాల నిషేదాన్ని ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ఎంపీలు భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు.పెద్ద పెద్ద తలకాయల సిఫార్సులకోసం కొందరు ఎంపీలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొంత మంది ఎంపీలు ఐసీసీ వైస్ ప్రెసిడెంట్ శరద్‌పవార్‌ను సైతం కలిశారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ నియోజవర్గం నుంచి అజహారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో అజార్‌కు బీసీసీఐ 2000 వ సంవత్సరంలో జివితకాల నిషేధపు వేటు వేసింది. తొమ్మిదేళ్ల క్రితం బీసీసీఐ బ్లాక్ లిస్టులో ఉంచిన అజార్‌కోసం ఇపుడు మన ఎంపీలు కొందరు రాయబారం నడపటానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లకు ఇలాంటి శిక్షలనుంచి విముక్తి లభించిందనే అంశాన్ని వీరు కారణంగా చూపుతున్నారు. బోర్డు మాజీ ప్రెసిడెంట్‌గాను, రాజకీయ పలుకుబడి ఉన్న నాయకునిగా పవార్ తన పరపతిని ఉపయోగించి బీసీసీఐని ఒప్పించాల్సిందిగా కోరారు. సినీ నటుడు, ఎంపీ రాజ్‌బబ్బర్, జితిన్ ప్రసాద్, బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ రాజీవ్‌శుక్లాలు పవార్‌ను కలిసిన బృందంలో ఉన్నారు.
News Posted: 21 November, 2009
|