సచిన్ గొప్పోడేం కాదు: సేన ముంబాయి : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ నిజమైన మహారాష్ట్రియన్ కాదని, రాష్ట్రం నుంచి మరాఠీ క్రికెటర్లను ప్రోత్సహించలేదని శివసేన ఆరోపించింది. సచిన్ టీవీ ఇటీవల 'ముంబాయి అందరిదీ' అని వ్యాఖ్యానించడంపై శివసేన అధినేత బాల్ థాక్రే తన పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసి సచిన్ పై ధ్వజం ఎత్తారు. దీనిపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, బిసిసిఐ సచిన్ కు మద్దతుగా నిలచారు. కానీ ఆ విషయాన్ని శివసేన ఇంకా వదిలిపేట్టలేదు. క్రికెట్‌లో సచిన్ గొప్పవాడే కావచ్చు కానీ ముంబాయి కంటే గోప్పేమీకాదని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. శివసేనకు చెందిన ‘సామ్నా’లో రాజ్యసభ సభ్యుడైన రౌత్ టెండుల్కర్‌పై విరుచుకుపడ్డాడు.
సచిన్ ఇతరులను మరచిపోయారని, బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీకి సహకరించలేదని రౌత్ ఆరోపించారు. మరో సందర్భంలో సునీల్ గవాస్కర్ నిజమైన మహారాష్ట్రియన్ అని రౌత్ కొనియాడుతూ, గవాస్కర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మహారాష్ట్ర, ముంబాయి నుంచి ఎక్కువ మందిని తన జట్టులోకి తీసుకున్నారని అన్నారు. క్రికెట్ గేమ్ కారణంగా సచిన్ వంటి ఆటగాళ్లు ధనవంతులయ్యారని, సచిన్ ఆస్తి రూ.200 కోట్లను దాటిందని అన్నారు.
News Posted: 22 November, 2009
|