బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కాన్పూర్ : శ్రీలంకతో ఇక్కడి గ్రీన్ పార్క్ లో మంగళవారం ప్రారంభమైన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ ఫలితం ఎటూ తేలకుండా డ్రాగా ముగిసిపోయిన విషయాన్ని పక్కన పెట్టి కాన్పూర్ టెస్ట్ ను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఇరు జట్లూ పకడ్బందీ వ్యూహాలతో బరిలో దిగాయి. ఈ మ్యాచ్ తామే గెలుస్తామన్న ధీమాతో భారత్, శ్రీలంక జట్లు రెండూ ధీమాగా ఉన్నాయి. కాగా, భారతజట్టులో ఇషాంత్ శర్మ స్థానంలో శ్రీశాంత్ ను, అమిత్ మిశ్రాకు బదులుగా ప్రజ్ఞాన్ ఓజాలను తీసుకున్నారు. అమ్మదాబాద్ టెస్ట్ మాదిరిగానే గౌతం గంభీర్ - వీరేంద్ర సెహ్వాగ్ లతో భారత్ రెండో టెస్ట్ లో తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
జట్ల వివరాలు :
భారత్ : గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్ / కీపర్), హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ప్రజ్ఞాన్ ఓజా, ఎస్. శ్రీశాంత్.
శ్రీలంక : తరంగ పరణవితన్, తిలకరత్నె దిల్షాన్, కుమార సంగక్కర (కెప్టెన్), మహేల జయవర్దనె, తిలన్ సమరవీర, ఏంజెలో మాథ్యూస్, పి. జయవర్దనె (వికెట్ కీపర్), చణక వెలెగెదర, రంగణ హెరత్, ముత్తయ్య మురళీధరన్, అజంతా మెండిస్.
News Posted: 23 November, 2009
|