భారత్ 642 ఆలౌట్ కాన్పూర్ : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తన తొలి ఇన్నింగ్స్ లో భారత్ 642 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ రెండో రోజు బుధవారం లంచ్ విరామం తరువాత భారత బ్యాట్స్ మెన్ వెంటవెంటనే అవుటవడంతో తొలి ఇన్నింగ్స్ వేగంగా ముగిసిపోయింది. భారత ఓపెనింగ్ లైనప్ పటిష్టమైన ప్రారంభాన్ని, భారీ స్కోరును అందించినా మిడిలార్డర్ కొద్దిగా నిలదొక్కుకొని ఆడినా, టెయిలెండర్లు మాత్రం శ్రీలంక బౌలర్ల ధాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు. అయినప్పటికీ భారత్ 642 పరుగులతో పటిష్టంగానే ఉంది.
భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్ (167) , వీరేంద్ర సెహ్వాగ్ (131)లు మెరుపు సెంచరీలు చేశారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన రాహుల్ ద్రావిడ్ (144) కూడా సెంచరీ చేశారు. టూ డౌన్ లో బరిలోకి వచ్చిన టెండుల్కర్ 40 పరుగులకే అవుటయ్యాడు. వివిఎస్ లక్ష్మణ్ (63), యువరాజ్ సింగ్ (67) అర్ధ సెంచరీలు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ ధోనీ సహా మరెవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేక చేతులెత్తేశారు. ఆఖరి వికెట్లన్నీ రంగణ హెరత్ పడగొట్టాడు. మొత్తం ఐదు వికెట్లను హెరత్ తీసుకున్నాడు. ధోనీ 4, హర్భజన్ సింగ్ 5, జహీర్ ఖాన్ 1, శ్రీశాంత్ పరుగులేవీ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేశారు. ప్రజ్ఞాన్ ఓజా మాత్రం రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
శ్రీలంక బౌలింగ్ లో రంగణ హెరత్ 5 వికెట్లు పడగొట్టాడు. అజంతా మెండిస్, ముత్తయ్య మురళీధరన్ చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు.
News Posted: 25 November, 2009
|