శ్రీలంక బ్యాటింగ్ ముంబాయి : భారత్ తో ఇక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో బుధవారం ఉదయం ప్రారంభమైన మూడవది, ఆఖరి కీలక టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. శ్రీలంక జట్టు భారత పర్యటనలో భాగంగా ఇంతకు ముందు రెండు టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. తొలి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగియగా రెండో టెస్ట్ ను భారత్ ఇన్నింగ్స్, 144 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. దీనితో భారత్ ఈ సీరీస్ లో 1- 0 ఆధిక్యంతో ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి ఎలాగైనా సీరీస్ ను చేజిక్కించుకోవాలని భారత్ కదం తొక్కుతున్నది. మరో పక్కన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి సీరీస్ ను సమం చేయాలన్న దృఢ నిశ్చయంతో శ్రీలంక సేన వ్యూహాలతో మైదానంలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో శ్రీలంక తరంగ పరణవితన్, తిలకరత్నె దిల్షాన్ లతో తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
శ్రీలంక జట్టు : తరంగ పరణవితన్, తిలకరత్నె దిల్షాన్, కుమార సంగక్కర (కెప్టెన్), మహేల జయవర్దనె, థిలన్ సమరవీర, పి. జయవర్దనె (వికెట్ కీపర్), ఏంజెలో మాథ్యూస్, నువన్ కులశేఖర, ముత్తయ్య మురళీధరన్, రంగణ హెరాత్, చణక వెలెగెదర.
భారత జట్టు : వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన / కీపర్), హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఎస్. శ్రీశాంత్, ప్రజ్ఞాన్ ఓజా.
News Posted: 1 December, 2009
|