శ్రీలంక 366/8 ముంబాయి : టీమిండియాతో ఇక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ తొలిరోజు బుధవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ 86 పరుగులతోను, ముత్తయ్య మురళీధరన్ పరుగులేవీ చేయకుండా నైట్ వాచ్ మెన్ గా ఉన్నారు. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ నాలుగు వికెట్లు తీసుకోవడం, శ్రీలంక ఓపెనింగ్ బ్యాట్స్ మన్ తిలకరత్నె దిల్షాన్ 160 బంతులు ఎదుర్కొని 109 పరుగు చేయడం, మాథ్యూస్ 86 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకుపోతుండడం తొలిరోజు ఆటలో విశేషాలు.
శ్రీలంక స్కోరు : తరంగ పరణవితన్ 53, దిల్షాన్ 109, కుమార సంగక్కర 18, మహేల జయవర్దనె 29, థిలన్ సమరవీర 1, ఏంజెలో మాథ్యూస్ 86 నాటౌట్, పి. జయవర్దనె 43, నువన్ కులశేఖర 12, రంగణ హెరాత్ 1, ముత్తయ్య మురళీధరన్ 0 నాటౌట్.
భారత బౌలింగ్ : హర్భజన్ సింగ్ 4, ప్రజ్ఞాన్ ఓజా 2, జహీర్ ఖాన్, ఎస్. శ్రీశాంత్ చెరో వికెట్ తీసుకున్నారు.
News Posted: 2 December, 2009
|