ముంబాయి : శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 393 పరుగులకు ఆలౌట్ అయింది. ఎనిమిది వికెట్లు నష్టపోయి 366 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలో దిగి గురువారం ఉదయం మరో 27 పరుగులు జోడించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 86 పరుగులతో నిన్న క్రీజ్ వద్ద ఉన్న ఏంజెలో మాథ్యూస్ మరో 13 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు ఉందనగా రన్నౌటయ్యాడు. టెండుల్కర్ సమయస్ఫూర్తితో అందించిన బంతిని ధోనీ చాకచక్యంగా అందుకొని మాథ్యూస్ ను రన్నౌట్ చేశాడు. ముత్తయ్య మురళీధరన్ మొత్తం 20 బంతులు ఎదుర్కొని 4 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. మాథ్యూస్ స్థానంలో బరిలోకి వచ్చిన చణక వెలెగెదర 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా ప్రజ్ఞాన్ ఓజా ఎల్ బిడబ్ల్యు చేసి వెనక్కి పంపించడం ద్వారా శ్రీలకం తొలి ఇన్నింగ్స్ కు ముగింపు పాడాడు. దీనితో శ్రీలంక మొత్తం 393 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం భారత్ మురళీ విజయ్ - వీరేంద్ర సెహ్వాగ్ లతో తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.