సెహ్వాగ్ చేజారిన చరిత్ర ముంబయి : ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ వీరేంద్ సెహ్వాగ్ చారిత్రక ట్రిపిల్ సెంచరీకి కేవలం ఏడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడుగా నిలచే అవకాశానికి శ్రీలంక స్టార్ బౌలర్ ముత్తయ మురళీధరన్ అడ్డుపడ్డాడు. మూడో రోజు ఆట ప్రారంభం అయ్యే సమయానికి సెహ్వాగ్ మూడో ట్రిపిల్ సెంచరీకి 16 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ముత్తయ మురళీధరన్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి సెహ్వాగ్ అభిమానులను నిరాశపరుస్తూ వెను తిరిగాడు. బుధవారం సెహ్వాగ్ అతి వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదు చేశాడు. అలానే 250 పరుగులను కూడా 239 బంతుల్లోనే చేసాడు. 284 పరుగులతో నాటౌట్ గా డ్రస్సింగ్ రూం కు చేరుకున్నాడు. సెహ్వాగ్ తన 293 పరుగుల స్కోరులో 40 బౌండరీలు, ఏడు సిక్స్ లు ఉన్నాయి. సెహ్వాగ్ అవుటయిన తరువాత సచిన్ బ్యాటింగ్ కు వచ్చాడు.
News Posted: 3 December, 2009
|