టి20కి 'ఆరో' కామెంటరీ ముంబై : భారత, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య శనివారం (డిసెంబర్ 12న) మొహాలిలో జరిగే ట్వంటీ 20 మ్యాచ్ కు 'ఆరో'గా నటించిన అమితాభ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. అమితాభ్ మ్యాచ్ మధ్య విరామాలలో 'ఎక్స్ పర్ట్ కామెంటరీ' ఇస్తారు. అమితాభ్ 'ఆరో'గా నటించిన 'పా' చిత్రం దర్శకుడు బాల్కీ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, 'మొహాలిలో టి 20 మ్యాచ్ కోసం ఆరో టెలివిజన్ లో ఎక్స్ పర్ట్ వ్యాఖ్యానం చేయబోతున్నారు' అని చెప్పారు.
క్రికెట్ క్రీడను స్వయంగా విపరీతంగా అభిమానించే 'బిగ్ బి' అమితాభ్ కు మొట్టమొదటిసారిగా క్రికెట్ పోటీపై వ్యాఖ్యానం చేయడం, అందునా ఆరోలా మృదువైన, పిల్లల గొంతుతో చేయడం ఒక సవాల్ కాగలదు. ఈ సవాల్ కోసం బిగ్ బి అప్పుడే సమాయత్తం అవుతున్నారు కూడా.
News Posted: 11 December, 2009
|