సెహ్వాగ్ సెంచరీ రాజ్ కోట్ : టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన వన్డే పరుగుల ఖాతాలో 12వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక్కడి మాధవరావ్ సింధియా స్టేడియంలో మంగళవారం శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో వీరూ మైదానంలో వీరవీహారమే చేశాడు. కేవలం 66 బంతుల్లో సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ సచిన్ టెండుల్కర్ కూడా దూకుడుగా ఆడి 63 బంతుల్లో ఒక సిక్సర్, 10 బౌండరీల సాయంతో 69 పరుగులు చేసి లంక బౌలర్ దిల్హార ఫెర్నాండో బంతికి బౌల్డ్ అయ్యాడు. వన్ డౌన్ లో బరిలోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక వైపున, వీరేంద్ర సెహ్వాగ్ మరోవైపున లంక బౌలర్లతో ఆటాడుకుంటున్నారు.
అంతకు ముందు శ్రీలంక జట్టు టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గాయం కారణంగా యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.
జట్ల వివరాలు :
భారత్ : వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్/కీపర్), గౌతం గంభీర్, వీరాట్ కొహ్లి, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, ప్రవీణ్ కుమార్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా.
శ్రీలంక : కుమార సంగక్కర (కెప్టెన్), తరంగ, దిల్షాన్, జయవర్దనె, కాందంబి, సమరవీర, జయసూర్య, ఏంజెలో మాథ్యూస్, మురళీధరన్, కులశేఖర, ఫెర్నాండో.
News Posted: 15 December, 2009
|