ధోనీపై నిషేధం ముంబాయి : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ దోనీపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ రెండు వన్డే మ్యాచ్ ల నిషేధం విధించింది. శుక్రవారంనాడు నాగ్ పూర్ శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఓవర్లు నెమ్మదిగా (స్లో ఓవర్ రేట్) వేయించాడన్న అభియోగంతో బోర్డు ఈ వేటు వేసింది. కటక్, కోల్ కతా వన్డేల్లో ధోనీపై ఈ నిషేధాన్ని బోర్డు అమలు చేస్తుంది. కాగా, ధోనీ స్థానంలో గౌతం గంభీర్ కు స్టాండ్ బై కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.
News Posted: 18 December, 2009
|