కెప్టెన్ గా సెహ్వాగ్ నాగ్ పూర్ : టీమిండియా తాత్కాలిక కెప్టెన్ గా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నియమించింది. శ్రీలంకతో డిసెంబర్ 21న కటక్ లోను, 24న కోల్ కతాలోను జరగనున్న రెండు వన్డేలకు భారతజట్టు కెప్టెన్ గా సెహ్వాహ్ వ్యవహరిస్తాడని బిసిసిఐ శనివారం ప్రకటించింది. నాగ్ పూర్ లో జరిగిన రెండో వన్డేలో 'స్లో ఓవర్ రేట్' కారణంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ దోనీపై ఐసిసి (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో రెండు వన్డేల నిషేధం విధించినట్లు బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం రాత్రి నిర్వహించిన విచారణ అనంతరం ధోనీపై ఈ నిషేధం నిర్ణయం తీసుకున్నాడు.
స్లో ఓవర్ రేటు కారణంగా ధోనీపై వేటు వేయడంతో పాటు భారత జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో కూడా 40 శాతం కోత విధించారు. నాగ్ పూర్ వన్డేలో భారత జట్టు సభ్యులు తరచూ సంప్రతింపులు జరపడంతో నిర్ణీత సమయం కన్నా నాగ్ పూర్ వన్డే 45 నిమిషాలు ఆలస్యంగా పూర్తయింది.
News Posted: 19 December, 2009
|