లంక లక్ష్యం 261 ఢాకా : ఆతిధేయ బంగ్లాదేస్ జట్టు శ్రీలంకకు 261 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో సోమవారం ముక్కోణపు సీరీస్ తొలి వన్డే (డే/నైట్) మ్యాచ్ బంగ్లాదేశ్ - శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. శ్రీలంక కెప్టెన్ ఆహ్వానం మేరకు ఆతిధేయ బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 260 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ ఎం. అష్రఫుల్ ఒక్కడే అత్యధికంగా 75 పరుగులు చేశాడు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఎం. మహ్మదుల్లా (45 పరుగులు), ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ (40 పరుగులు), ముష్ఫికర్ రహీం (35 పరుగులు), రెండో ఓపెనర్ ఇమ్రుల్ కయీస్ 23, నయీం ఇస్లాం (22 నాటౌట్) ఉన్నారు. కాగా రఖీబుల్ హసన్ (0), కెప్టెన్ సఖీబుల్ హసన్ ఒక్క పరుగు చేయగా అబ్దుర్ రజ్జాక్ ఒక్క పరుగు చేసి నాటౌట్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు.
శ్రీలంక బౌలింగ్ లో సురంగ లక్మల్, సూరజ్ రణ్ దివ్ చెరో రెండేసి బంగ్లా వికెట్లను పడగొట్టారు. నువన్ కులశేఖర, తిలకరత్నె దిల్షాన్ చెరో వికెట్ తీసుకున్నారు. అష్రఫుల్ రన్నౌట్ అయ్యాడు.
News Posted: 4 January, 2010
|