లంక విజయం మీర్ పూర్ (బంగ్లాదేశ్) : ముక్కోణపు పోటీలో శ్రీలంక వరుసగా రెండో రోజూ విజయం సాధించింది. కొద్ది రోజుల క్రితం భారత పర్యటనలో ఇండియా చేతిలో ఎదురైన పరాభవానికి ఇప్పుడు బదులు తీర్చుకుంది. ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో వన్డేను భారత్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుచుకుంది. తిలన్ సమరవీర వీరోచిత పోరాటం అన్ బీటెన్ సెంచరి (105 నాటౌట్) ప్రతిభ, థిస్సార పెరీరా వేగవంతమైన పరుగుల సాక్షిగా శ్రీలంక ఈ విజయాన్ని తమ పొదిలో వేసుకుంది. సమరవీర మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
280 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని చేరుకుంది. ఉపుల్ తరంగ 30, లహిరు తిరిమన్నె 22, కెప్టెన్ కుమార సంగక్కర 60, తిలన్ సమరవీర 105 నాటౌట్, తిలిన కాందంబె 8, సూరజ్ రణ్ దివ్ 4, తిస్సార పెరీరా 36 నాటౌట్ పరుగులు చేశారు. భారత్ బౌలింగ్ లో హర్భజన్ సింగ్ ఒక్కడే మూడు వికెట్లు తీసుకున్నాడు. ఎస్. శ్రీశాంత ఒక వికెట్ పడగొట్టాడు.
News Posted: 5 January, 2010
|