బంగ్లాదేశ్ బ్యాటింగ్ మీర్ పూర్ (బంగ్లాదేశ్) : ముక్కోణపు వన్డే (డే/నైట్)ల సీరీస్ మూడో మ్యాచ్ ను ఆతిధేయ బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. గురువారం ఇక్కడ టీమిండియాతో బంగ్లాదేశ్ జట్టు తలపడుతోంది. ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ సీరీస్ లో ఇంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్ లలోనూ బంగ్లాదేశ్, భారత్ లపై శ్రీలంక విజయాలు సాధించింది. శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసిన భారత్, బంగ్లాదేశ్ ఇరు జట్లూ గెలుపు కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడేందుకు సమాయత్తం అయ్యాయి.
జట్ల వివరాలు :
బంగ్లాదేశ్ : తమిమ్ ఇక్బాల్, ఇమ్రుల్ కయీస్, ఎం. అష్రఫుల్, రఖీబుల్ హసన్, సకీబుల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీం (వికెట్ కీపర్), ఎం. మహ్మదుల్లా, నయీం ఇస్లాం, అబ్దుర్ రజాక్, సయీద్ రసెల్, రూబెల్ హొస్సయిన్.
భారత్ : గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కొహ్లీ, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్/కీపర్), సురేష్ రైనా, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, ఎస్. శ్రీశాంత్.
News Posted: 7 January, 2010
|