భారత్ టార్గెట్ 297 మీర్ పూర్ (బంగ్లాదేశ్) : ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో గురువారం జరుగుతున్న ముక్కోణపు వన్డే (డే/నైట్) సీరీస్ మూడో మ్యాచ్ లో భారత్ విజయ లక్ష్యాన్ని 297 పరుగులుగా బంగ్లాదేశ్ నిర్దేశించింది. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ సఖీబుల్ హసన్ ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. తమిమ్ ఇక్బాల్ - ఇమ్రుల్ కయీస్ తో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 296 పరుగులు చేసింది. తమిమ్ ఇక్బాల్ 60, ఇమ్రుల్ కయీస్ 70, ఎం. అష్రఫుల్ 29, కెప్టెన్ సఖీబుల్ హసన్ 0, రఖీబుల్ హసన్ 32, ముష్ఫికర్ రహీం 6 పరుగులు చేశారు. ఎం. మహ్మదుల్లా 60 పరుగులతోను, నయీం ఇస్లాం 14 పరుగులతోనూ నాటౌట్ బ్యాట్స్ మెన్ గా ఉన్నారు.
భారత్ బౌలింగ్ లో ఆశిష్ నెహ్రా, ఎస్.శ్రీశాంత్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. సఖీబుల్ హసన్ ను జహీర్ ఖాన్ రన్నౌట్ చేశాడు.
News Posted: 7 January, 2010
|