బ్యాటింగ్ ఎంచుకున్న లంక మీర్ పూర్ : ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్ తో ఆదివారం జరుగుతున్న ముక్కోణపు వన్డే సీరీస్ 5వ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచి ఫైనల్స్ లో బెర్త్ రిజర్వ్ చేసుకుంది. ఫైనల్స్ లో ఆడే అవకాశాలు సానుకూలం అవ్వాలంటే ఈ రోజు మ్యాచ్ ను భారత్ నెగ్గాల్సి ఉంటుంది. లేదంటే తరువాత మళ్ళీ బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గి తీరాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైనల్స్ లో బెర్త్ వేసుకున్న ఊపులో శ్రీలంక బరిలో దిగింది. ఎలాగైనా ఈ రోజు గెలిచి తీరాలన్న ధ్యేయంతో ధోనీ సేన పట్టుదలగా ఉంది.
జట్ల వివరాలు :
శ్రీలంక : తిలకరత్నె దిల్షాన్, ఉపుల్ తరంగ, కె. సంగక్కర (కెప్టెన్), మహేల జయవర్దనె, తిలన్ సమరవీర, తిలిన కాందంబె, తిస్సార పెరీరా, సూరజ్ రణ్ దివ్, సురంగ లక్మల్, తిలిన్ తుషార, చణక వెలెగెదెర.
భారత్ : గౌతం గంభీర్, దినేష్ కార్తీక్, విరాట్ కొహ్లి, యువరాజ్ సింగ్, ఎం.ఎస్. ధోనీ (కెప్టెన్ / కీపర్), సురేష్ రైనా, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా, ఎస్. శ్రీశాంత్, సుదీప్ త్యాగి.
News Posted: 10 January, 2010
|