భారత్ జయకేతనం మిర్ పూర్ (బంగ్లాదేశ్): భారత్ ఫైనల్ కు చేరుకుంది. అందరూ ఊహించనట్టే పసికూనలుకాదు కాని పస ఉన్నలు కూనలపై విజయం సాధించి, ఫైనల్ కు చేరుకుంది. ఆరు వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించింది.ము]క్కోణపు సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో భారత్ అలవోకగా విజయాన్నిఅందుకుంది. ఈ సిరీస్ లోభారత్, శ్రీలంక జట్టులు ఇప్పటికే ఫైనల్లో బెర్త్ లు ఖరారు చేసుకోవడంతో ఈ మ్యాచ్ మొక్కుబడిగానే జరిగినప్పటికీ ఆసక్తికరంగా సాగింది. భారతజట్టులో విరాట్ కొహ్లీ మెరుపు సెంచరీ సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 247 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందించింది.ఓపెనర్లుగా బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్ 34, గౌతమ్ గంభీర్ 41 పరుగులు చేసి శుభారంబం అందించారు.గంభీర్ 46 బాల్స్ లో నాలుగు ఫోర్ లు సాధించాడు. కార్తీక్, గంభీర్ లు పెవిలియన్ ముఖం పట్టిన తరువాత యువరాజ్, విరాట్ ల భాగస్వామ్యం లక్ష్యసాధనలో పడింది. అయితే యువరాజ్ సింగ్ దూకుడుగా ఆడుతన్న విరాట్ కు బ్యాటింగ్ అవకాశం కల్పించాలని తొందరపడి షాట్ ఆడుతూ ఎల్ బి డబ్యూ ఆవుట్ అయ్యాడు. అయితే తరువాత బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ ధోనీ కోహ్లీకి తొడయ్యాడు. ధోనీ 35 బాల్స్ లో 32 పరుగులు చేసి వెనుదిరిగాడు. తరువాత రంగంలోకి దిగిన సురేశ్ రైనాతో విరాట్ కొహ్లీ 95 బాల్స్ లో 11 ఫోర్ లతో 102 పరుగులు సాధించాడు. 94 పరుగులు వద్ద షాకీబ్ హసన్ బౌలింగ్ లో కొహ్లీ వరుసగా రెండు ఫోర్ లు కొట్టి సెంచరీ సాధించాడు. సురేశ్ రైనా 18 బాల్ లో 18 పరుగులు చేసాడు.దీంతో 248 పరుగులు లక్ష్యాన్నిభారత్ పూర్తి చేసి విజయాన్ని కైవశం చేసుకుంది. అయితే సెంచరీ సాధించిన విరాట్ కొహ్లీకి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ ఆవార్డ్ దక్కింది. ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
News Posted: 11 January, 2010
|