ఫీల్డింగ్ ఎంచుకున్న లంక మీర్ పూర్ (బంగ్లాదేశ్) : ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం జరగనున్న ఐడియా కప్ ముక్కోణపు వన్డే క్రికెట్ ఫైనల్ పోటీలో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది. మూడేసి విజయాలు, ఒక ఓటమితో సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లు ఈ సీరీస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకొని తీరాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంట నుంచి భారత్ - లంక మధ్య ఫైనల్ పోరు ప్రారంభం అవుతుంది.
జట్ల వివరాలు :
శ్రీలంక : ఉపుల్ తరంగ, తిలకరత్నె దిల్షాన్, కుమార సంగక్కర (కెప్టెన్ / కీపర్), మహేల జయవర్దనె, తిలన్ సమరవీర, తిలిన కాందంబె, తిస్సార పెరీరా, సూరజ్ రణ్ దివ్, తిలన్ తుషార, నువన్ కులశేఖర, చణక వెలెగెదెర.
భారత్ : గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కొహ్లీ, యువరాజ్ సింగ్, ఎం.ఎస్. ధోనీ (కెప్టెన్ / కీపర్), సురేష్ రైనా, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, ఎస్. శ్రీశాంత్.
News Posted: 13 January, 2010
|