కష్టాల్లో భారత్ మీర్ పూర్ (బంగ్లాదేశ్) : ఎన్నో ఆశలతో ఐడియా కప్ ముక్కోణపు పోటీ ఫైనల్ లో ఆడుతున్న భారత్ కేవలం 68 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టలకు ఎదురీదుతోంది. కేవలం 12 ఓవర్లకే భారత టాప్ ఆర్డర్ మొత్తాన్ని లంక బౌలర్లు కులశేఖర, వెలెగెదెర రూపంలో తుత్తునియలు చేసింది. శ్రీలంక బౌలర్ల నుంచి బంతి వస్తుంటేనే భారత బ్యాట్స్ మెన్ భయాందోళనలకు గురవుతున్నారా? అన్నంతగా ఉంది. క్రీజ్ వద్దకు రావడం ఆ వెంటనే ధోనీ సేన క్యూ కట్టి వెనక్కి వెళ్ళిపోతున్నది. అసలు భారత్ నిర్ణీత 50 ఓవర్లు మైదానంలో నిలబడి ఆడగలదో లేదో అనే అనుమానాలు క్రికెట్ అభిమానులకు కలుగుతోంది. ఈ ఫైనల్ లో విజయం సాధించడం ద్వారా భారత్ దూకుడుకు కళ్ళెం వేయాలని చూస్తున్న శ్రీలంక వ్యూహం ఫలించేలా కనిపిస్తోంది. మధ్యాహ్నం 2.37 గంటలకు భారత బ్యాట్స్ మెన్ స్కోర్లు ఇలా ఉన్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ 42, గౌతం గంభీర్ 0, విరాట్ కొహ్లీ 2, యువరాజ్ సింగ్ 0, కెప్టెన్ ధోనీ 14 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యారు. సురేష్ రైనా 8, రవీంద్ర జడేజా 5 పరుగులతో ఆడుతున్నారు.
News Posted: 13 January, 2010
|