అభినవ్ కు కోపమొచ్చింది! న్యూఢిల్లీ : ఒలంపిక్స్ లో భారతావనికి బంగారు పతకాన్ని సాధించిపెట్టిన అభినవ్ బింద్రా రైఫిల్ షూటింగ్ కి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇకపై తాను రైఫిల్ షూటింగ్ లో క్రీడలో కొనసాగేది లేదని తెగేసి చెప్పాడు. భారత జాతీయ రైఫిల్ సంఘం(ఎన్ ఆర్ ఎ ఐ)తో నెలకొన్న వైరంతో బింద్రా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ ఆర్ ఎ ఐ వ్యవహరిస్తున్న తీరు కారణంగానే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు బింద్రా స్పష్టం చేసాడు. రైఫిల్ షూటింగ్ కు సంబంధించి బింద్రా ఆరు నెలల పాటు విదేశాల్లో శిక్షణ పొందుతున్నాడు. ఢిల్లీలో జరిగే కామన్వెల్త్ క్రీడల్లోను, చైనా లో జరిగే ఆసియా క్రీడల్లోను పాల్గొనేందుకు బింద్రా అక్కడ శిక్షణ పొందుతున్నాడు. అయితే ఎన్ ఆర్ ఎ ఐ మాత్రం బింద్రా భారత్ కు వచ్చి తాము నిర్వహించే ట్రయల్స్ లో పాల్గోనాలంటూ పదేపదే ఒత్తిడి చేస్తోంది. అయితే శిక్షణ వదులుకొని ట్రయల్స్ లో పాల్గొనేందుకు బింద్రా సుముఖంగా లేడు. దీంతో ఎన్ఆర్ఎఐ ఒత్తిడితో విసుగు చెందిన బింద్రా ఇకపై తాను రైఫిల్ షూటింగ్ లో క్రీడను ఆడేది లేదని ప్రకటించాడు. రైఫిల్ సంఘం తీరుతో విసుగు చెంది తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించాడు.
News Posted: 16 January, 2010
|