మాస్టర్ ఖాతాలో మరో రికార్డ్ చిట్టగాంగ్ : చిచ్చరపిడుగు, మాస్టర్ బ్లాస్టర్ టీమిండియా క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో 13 వేల పరుగులు చేసిన తొలి క్రీడాకారుడిగా సచిన్ నిలిచాడు. ఆదివారం ఇక్కడ బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఈ విశిష్ట రికార్డును పూర్తి చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో సచిన్ వ్యక్తిగత స్కోరు 30 పరుగులు చేయగానే మాస్టర్ బ్లాస్టర్ 13 వేల పరుగుల మైలురాయిని చేరాడు. కాగా, తొలిరోజు ఆట ముగిసే సమయానికి సచిన్ 76 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. 163వ టెస్ట్ ఆడుతున్న టెండుల్కర్ 43 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశాడు.
News Posted: 17 January, 2010
|