బంగ్లా టెస్ట్ కు బ్యాడ్ లైట్ చిట్టగాంగ్ (బంగ్లాదేశ్) : ఇక్కడి జోహర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట వెలుతురు సరిగా లేని కారణంగా అర్ధంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. రెండో రోజు సోమవారంనాడు భారత్ నిన్నటి ఓవర్ నైట్ స్కోర్ కు మరో 25 పరుగులు జోడించి 243 పరుగులకు ఆలౌట్ అయిది. అనంతరం ఆతిథేయ బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. తమిమ్ ఇక్బాల్ - ఇమ్రుల్ కయీస్ లతో బరిలో దిగిన బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ఈ సమయంలో మైదానంలో వెలుతురు బాగా తగ్గిపోవడంతో మ్యాచ్ ను ఈ రోజుకు నిలిపివేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆట ముగిసే సమయానికి తమిమ్ ఇక్బాల్ 31, ఇమ్రుల్ కయీస్ 23, షహరియార్ నఫీస్ 4 పరుగులు చేసి ఔటవ్వగా, ఎం. అష్రఫుల్ పరుగులేవీ చేయకుండా, రఖీబుల్ హసన్ ఒక్క పరుగుతోను క్రీజ్ వద్ద ఉన్నారు. భారత్ బౌలింగ్ లో జహీర్ ఖాన్ రెండు వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ తీసుకున్నారు.
News Posted: 18 January, 2010
|