అభినవ్ కు కిక్ న్యూఢిల్లీ : ప్రముఖ రైఫిల్ షూటింగ్ క్రీడాకారుడు, ఏకైక ఒలంపిక్ బంగారపతక విజేత అభినవ్ బింద్రాపై జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ ఆర్ ఎ ఐ) వేటు వేసింది. త్వరలో జరగనున్న రైఫిల్ షూటింగ్ వరల్డ్ కప్ పోటీల్లో బింద్రా పాల్గొనకుండా నిషేధించింది. ట్రయల్స్ కు హాజరయ్యేందుకు బింద్రా అనాసక్తత ప్రదర్శించడంతో పాటుగా అసోసియేషన్ పై తీవ్రమైన విమర్శలు చేసినందుకు గాను ఎన్ ఆర్ ఎ ఐ ఈ చర్య తీసుకుంది. నేషనల్ రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ట్రయల్స్ నిర్వహిస్తోంది. అయితే ఈ ట్రయల్సో పాల్గొనాల్సిందిగా బింద్రాకు ఇటీవల ఎన్ ఆర్ ఎ ఐ ఆహ్వానం పంపింది. తాను విదేశాల్లో శిక్షణకు ముందస్తుగా షెడ్యూల్ ఖరారు చేసుకున్నందున ట్రయల్స్ కు హాజరు కాలేనని బింద్రా సమాచారం పంపడంతో పాటుగా ఎన్ఆర్ఎఐ వైఖరితో తాను పూర్తిగా విసిగిపోయానని, ఇలాగైతే తాను షూటింగ్ కు గుడ్ బై చెబుతానని హెచ్చరించాడు. బింద్రా వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన అసోసియేషన్ వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనకుండా వేటు వేసింది.
News Posted: 18 January, 2010
|