వేలానికి 66 మంది క్రికెటర్లు ముంబయి: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పాల్గొనే కొత్త ఆటగాళ్ల కోసం మంగళవారం వేలం మొదలైంది. వేలం కోసం టెస్ట్ ఆడే అన్నీ దేశాలతో పాటు కెనడా, హాలాండ్‌ల కు చెందిన 66 మంది క్రికెటర్లు అందు బాటులో ఉన్నారు. ఐతే ఫ్రాంచైజీల వద్ద కేవలం 12 మంది ఆటగాళ్ల స్థానాలు మాత్రమే ఖాళీలుగా ఉన్నాయి. మరోవైపు ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) నుంచి వచ్చిన ఆటగాళ్లు షేన్‌బాండ్ (కివీస్), కెంప్ (దక్షిణాఫ్రికా), అబ్దుల్జ్రాక్ (పాకిస్థాన్), మార్టిన్ (ఆసీస్) తదితరులు కూడా ఈ వేలంలో అందుబాటులో ఉన్నారు. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి 11 మంది చొప్పున, శ్రీలంక నుంచి 9 మంది, ఇంగ్లాండ్, వెస్టిండీ స్‌ల నుంచి ఎనిమిది మంది, న్యూజిలాండ్ నుంచి నలుగురు, బంగ్లాదేశ్, జింబాబ్వే, హాలాండ్, కెనడాల నుంచి ఒక్కోక్క ఆటగాడి చొప్పున వేలం జాబితాలో ఉన్నారు. ఇందులో వెస్టిండీస్ స్టార్ జమైకా ఆల్‌రౌండర్ పొలార్డ్, కివీస్ ఫాస్ట్‌బౌలర్ షేన్‌బాండ్, పాకిస్థాన్ టి20 కెప్టెన్ షాహిద్ అఫ్రిదిలకు ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. గత ఏడాది పీటర్సన్, ఫ్లింటాఫ్‌కు భారీ మొత్తం వెచ్చించినప్పటికి వారు రాణించలేకపోవడంతో పాటు సీజన్ మొత్తానికి అందుబాటులో లేరు. కాబట్టి ఈ సారి ఫ్రాంచైజీలు వేలంలో ఆచి తూచి వ్యవహరించే అవకాశం ఉంది. సత్తా ఉండి, సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండే ఆటగాళ్లకు జట్టు యాజమాన్యాలు మొగ్గుచూ పుతారు. కాంట్రాక్ట్ లభించిన ఆటగాళ్లతో జట్టు మేనేజ్‌మెంట్ ఈ ఏడాదికి మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఐపీఎల్-3తో పాటు క్రికెటర్లు చాంపియన్స్ లీగ్ కూడా ఆడాల్సివుంది.
News Posted: 18 January, 2010
|