బంగ్లాదేశ్ 242 ఆలౌట్ చిట్టగాంగ్ (బంగ్లాదేశ్) : టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తన తొలి ఇన్నింగ్స్ లో ఆతిథేయ బంగ్లాదేశ్ జట్టు 242 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో భారత్ ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఇక్కడి జోహర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ మూడో రోజు ఆట మంగళవారం కొనసాగుతోంది. భారత జట్టును సోమవారం ఉదయం 243 పరుగులకు ఆలౌట్ చేసిన బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లు జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా చెరో మూడేసి వికెట్లను పడగొట్టి, శ్రీశాంత్, ఇషాంత్ శర్మ చెరో రెండేసి వికెట్లను తీసుకోవడం ద్వారా బంగ్లాదేశ్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగింది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : తమిమ్ ఇక్బాల్ 31, ఇమ్రుల్ కయీస్ 23, షహ్రియార్ నఫీజ్ 4, ఎం. అష్రఫుల్ 2, రఖీబుల్ హసన్ 17, కెప్టెన్ సఖీబుల్ హసన్ 17, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం 44, ఎం. మహ్మదుల్లా 69, షాహదత్ హొస్సయిన్ 11, షఫీయుల్ ఇస్లాం 6 పరుగులు చేశారు. రూబెల్ హొస్సయిన్ బంతులేవీ ఎదుర్కోకుండా పరుగులేవీ చేయకుండా నాటౌట్ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు.
News Posted: 19 January, 2010
|