బంగ్లా ముందు భారీ లక్ష్యం చిట్టగాంగ్ : ఆతిథేయ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారత్ భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. బంగ్లాదేశ్ తో ఇక్కడి జోహర్ అహ్మద్ చౌధురి క్రికెట్ స్టేడయంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగవ రోజు మధ్యాహ్నానికి భారత్ 413 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మంగళవారంనాడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 8 వికెట్లు నష్టపోయి 413 పరుగులు చేసింది. దీనితో బంగ్లా విజయ లక్ష్యాన్ని 415 పరుగులకు భారత్ నిర్దేశించింది. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ సెంచరీ (116 పరుగులు), అర్ధ సెంచరీ చేసిన అమిత్ మిశ్రా, తుది వరకూ బరిలో నిలబడి 89 బంతులు ఎదుర్కొని 69 పరుగులు చేసిన లక్ష్మణ్ నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలవడం, క్రీజ్ వద్దకు వచ్చి భారత్ బ్యాట్స్ మెన్ ప్రతి ఒక్కరూ తమ వంతు స్కోర్ పెంచడంతో బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు అవకాశం కల్పించాయి.
టీమిండియా స్కోర్ : గౌతం గంభీర్ 116, వీరేంద్ర సెహ్వాగ్ 45, అమిత్ మిశ్రా 50, రాహుల్ ద్రావిడ్ 24, సచిన్ టెండుల్కర్ 16, వివిఎస్ లక్ష్మణ్ 69 నాటౌట్, యువరాజ్ సింగ్ 25, దినేష్ కార్తీక్ 27, జహీర్ ఖాన్ 20, ఇషాంత్ శర్మ 7 నాటౌట్. ఎగ్ స్ట్రాలు 14. మొత్తం 8 వికెట్ల నష్టానికి 413 పరుగులు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఒక్క పరుగుతో కలిపి టీమిండియా స్కోర్ 414.
బంగ్లాదేశ్ బౌలింగ్ : కెప్టెన్ సఖీబుల్ హసన్, ఎం. మహ్మదుల్లా చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. షఫీయుల్ ఇస్లాం, షాహదత్ హొస్సయిన్, రుబెల్ హొస్సయిన్ తలో వికెట్ తీసుకున్నారు.
News Posted: 20 January, 2010
|