న్యూఢిల్లీ : ప్రఖ్యాత క్రికెటర్ సర్ వీ వీ రిచర్డ్స్ నెలకొల్పిన రికార్డును భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ సమం చేసాడు. ఆలాగే క్రికెట్ దిగ్గజం బ్రాడ్ మన్ పేరిట ఉన్న మరో రికార్డుకు కూడా చేరువయ్యాడు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో సోమవారం ఆఫ్ సెంచరీ చేయడం ద్వారా గంభీర్ టెస్ట్ మ్యాచ్ లలో వరుసగా 11 హాఫ్ సెంచరీలు పూర్తి చేసాడు. దీంతో టెస్టుల్లో వరుసగా 11 హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్ గా ఉన్న రిచర్డ్స్ పేరిట ఉన్నరికార్డ్ సరసన గంభీర్ కూడా చేరాడు. ఆలాగే టెస్ట్ మ్యాచ్ లలో వరుసగా ఆరు సెంచరీలు చేసిన వీరుడుగా బ్రాడ్ మన్ పేరిట మరో రికార్డుకు కూడా గంభీర్ చేరువయ్యాడు.
టెస్టుల్లో వరుసగా ఇప్పటికే ఐదు సెంచరీలు చేసిన గంభీర్ ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా సెంచరీ చేసి బ్రాడ్ మన్ రికార్డును సమం చేస్తాడని భారత క్రికెట్ అభిమానులంతా ఆశించారు. అయితే సోమావారం నాటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఈ అద్భుతం సాధించకుండానే గంభీర్ అవుటయ్యాడు. దీంతో బ్రాడ్ మన్ రికార్డును సమానం చేసే ఛాన్స్ మిస్సయ్యాడు. అయితే ఈ టెస్టులో సెకెండ్ ఇన్నింగ్స్ లోనైనా గంభీర్ అభిమానుల కలలను నెరవేరుస్తూ సెంచరీ చేసి బ్రాడ్ మన్ రికార్డును సాధిస్తాడో లేదో చూడాలి. అయితే రిచర్డ్స్ రికార్డును సమం చేసిన ఆనందం మాత్రం మిగిలింది.