సచిన్, ద్రవిడ్ సెంచరీలు మిర్పూర్ : బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 226 పరుగులు ఆధిక్యం సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మొత్తం 459 పరుగులు చేయడం ద్వారా ఈ ఆధిక్యాన్ని సాధించగలిగింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ లు చెరో సెంచరీ నమోదు చేయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఈ స్కోరు కనబరచగలిగింది. తొలి ఇన్నింగ్స్ లో సచిన్ 143 పరుగులు చేయగా, రాహుల్ ద్రవిడ్ 111 పరుగులు వద్ద గాయపడటంతో రిటైర్డహర్ట్ ప్రకటించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గౌతంగంభీర్ 63 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేసాడు. దీంతో వరుసగా 11 హాఫ్ సెంచరీలు చేసిన వి వి రిచర్డ్స్ చేసిన రికార్డును గంభీర్ సమం చేసాడు. గంభీర్ సెంచరీ చేసి ఉంటే వరుసగా 11 సెంచరీలు చేసిన బ్రాడ్ మన్ రికార్డును సమం చేసేవాడు. కానీ 63 పరుగుల వద్ద ఆయన అవుటయ్యాడు. సెహ్వాగ్ 56 పరుగులు, మురళీ విజయ్ 30, హర్భజన్ 13 పరుగులు చేసారు. దీనితో రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ అయిదు వికెట్లు కోల్పోయి 459 పరుగులు చేసింది. తద్వారా ఇప్పిటికీ 226 పరుగుల ఆథిక్యం సాధించగలిగింది. బంగ్లా బౌలర్లలో ఇస్లాం, ఆల్ హాసన్ చెరో రెండు వికెట్లు సాధించగా హుస్సేన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
News Posted: 25 January, 2010
|