'క్రికెట్ కు అన్యాయం' న్యూఢిల్లీ : ఐపిఎల్ లోకి పాకిస్తాన్ ఆటగాళ్ళను తీసుకోకపోవడం 'క్రికెట్ క్రీడకు అన్యాయం చేయడం' గా కేంద్ర హోం మంత్రి చిదంబరం అభివర్ణించారు. ప్రభుత్వం వైపు నుంచి పాక్ క్రికెటర్ల విషయమై ఐపిఎల్ కు ఎలాంటి సూచన చేయలేదని ఆయన సోమవారం నాడు స్పష్టం చేశారు. 'పాక్ క్రీడాకారుల్లో ట్వంటీ20 క్రికెట్ లో మేలైన వారున్నారు. వారు వ్యక్తిగతంగా ఐపిఎల్ కు వచ్చారు కాని పాక్ దేశం జట్టుగా కాద'ని చిదంబరం చెప్పారు. వారిని తీసుకోకపోవడం క్రికెట్ క్రీడకు అన్యాయం చేయడమేనని, ఐపిఎల్ ఎందుకు అలా చేసిందో తనకు అర్ధం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
తమ క్రీడాకారులను తీసుకోకపోతే ఏ దేశమైనా అవమానంగానే భావిస్తుందని ఆయన అన్నారు. అయిదే దానిపై వారు స్పందించ తీరు సరైందా? కాదా? అన్నదానిపై తానేమీ మాట్లాడనని చిదంబరం చెప్పారు. అయితే పాకిస్తాన్ క్రికెటర్లను తీసుకోకపోవడం క్రికెట్ ప్రేమికులకు నిరాశ కలిగించిందని ఆయన అన్నారు. క్రికెట్ అభిమానిగా తాను కూడా అసంతృప్తికి లోనయ్యానని ఆయన తెలిపారు. ప్రభుత్వం 17 మంది పాక్ క్రికెటర్లకు వీసాలు ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఐపిఎల్ ఫ్రాంచైజీలు తీసుకోకపోతే తాము చేయగలిగిందేమీ లేదని ఆయన అన్నారు.
News Posted: 25 January, 2010
|