ఇది జహీర్ విజయం
మీర్ పూర్ : ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఆతిథ్య బంగ్లాదేశ్ తో బుధవారం జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ను టీమిండియా పది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. బుధవారం లంచ్ విరామానంతరం బంగ్లాదేశ్ 312 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో భారత్ విజయానికి కేవలం రెండు పరుగుల కోసం రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అగత్యం ఏర్పడింది. వీరేంద్ర సెహ్వాగ్ - గౌతం గంభీర్ లతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వ్యక్తిగత పరుగులేవీ చేయకుండానే విజయం వరించింది. బంగ్లా ఓపెనింగ్ బౌలర్, కెప్టెన్ సఖీబుల్ హసన్ వేసిన రెండు బంతులూ బై స్ గా రెండు పరుగులు ఇచ్చాడు. ఈ విజయంతో భారత జట్టు శ్రీలంక పర్యటనలో భాగంగా నిర్వహించిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ ను 2 - 0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగొట్టిన జహీర్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
అంతకు ముందు 311 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉన్న భారత్ పై బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ మంగళవారం ప్రారంభించింది. ఆట నాలుగో రోజు బుధవారం లంచ్ విరామానికి ముందు ఒక్క పరుగుతో వెనుకబడి ఉన్న బంగ్లాదేశ్ అనంతరం మరో 2 పరుగులు జత చేసి ఆలౌట్ అయింది.
అంతకు ముందు భారత బౌలర్ జహీర్ ఖాన్ 7 బంగ్లా వికెట్ల కూల్చిపారేశాడు. ఆట ఒక్క 88వ ఓవర్ (88.2, 88.4, 88.5)లోనే జహీర్ ఖాన్ రఖీపుల్ హసన్, ఎం. మహ్మదుల్లా, షఫీయుల్ ఇస్లాం వికెట్లను పడగొట్టాడు. అయితే, ఖాన్ హ్యాట్రిక్ ను మిస్సయ్యాడు. మొత్తం 20.3 ఓవర్లు బంతులు వేసిన జహీర్ ఖాన్ 87 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు. అందులో రెండు మేడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ప్రజ్ఞాన్ ఓజా 2, హర్భజన్ సింగ్ ఒక్క వికెట్ తీసి భారత విజయంలో తమ వంతు సహాయాన్ని అందించారు.
News Posted: 27 January, 2010
|