ఫైనల్లో పేస్ జంట మెల్ బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో లియాండర్ పేస్ జంట ఫైనల్లో అడుగు పెట్టింది. మెల్ బోర్న్ లో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో గెలుపొందడం ద్వారా పేస్ జంట ఫైనల్ కు ఛాన్స్ ను దక్కించుకుంది. అంతేగాక లియాండర్ పేస్ సరికొత్త రికార్డుకు చేరువయ్యాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ లు గెలుచుకున్న భారతీయ ఆటగాడుగా మహేశ్ భూపతి నెలకొల్పిన రికార్డును పేస్ సమం చేయాలంటే ఈ గ్రాండ్ శ్లామ్ లో విజయం సాధిస్తే సరిపొతుంది. మహేశ్ భూపతి ఇప్పటివరకు 11 గ్రాండ్ శ్లామ్ లలో విజయం సాధించి రికార్డును స్థాపించాడు. అయితే పేస్ 10 గ్రాండ్ స్లామ్ లలో విజయం సాధించి మహేశ్ భూపతి రికార్డుకు చేరువయ్యాడు.
అస్ట్రేలియా మిక్స్ డ్ టోర్నీలో ఇండో- జింబాబ్వే జంట లియాండర్ పేస్, కారా బ్లాక్ లు కలసి లిసా రేమండ్, మూడీలతో శుక్రవారం మెల్ బోర్న్ టోర్నీలో తలపడ్డారు. ఈ మ్యాచ్ లో పేస్ జంట ( 6-7, 7-6, 10-7) స్కోరు సాధించింది. అయితే తొలి సెట్ లో పరాజయం చవి చూసినా తదుపరి సెట్ ఆధిక్యం ప్రదర్శించి మ్యాచ్ ను ట్రై బ్రేక్ చేసి ఫైనల్ కు చేరగలిగారు. అమెరికాకు చెందిన రేమండ్, దక్షిణాఫ్రికాకు చెందిన డేవీస్ మూడీలు తొలుత బాగానే ఆడినా, తరువాత సెట్ లలో లియాండర్ పేస్ జంటను నిలువరించలేకపోయారు. అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన పేస్ జంట ఫైనల్లో రష్యాకు చెందిన మకరోవా, జకోస్లేవియాకు చెందిన లెవినిస్కీతో తలపడనున్నారు. అయితే లియాండర్ పేస్ 2003 లో ఆస్ట్రేలియా మిక్స్ డ్ టైటిల్ ను సాధించగా, ఆ తరువాత ఏడాది రన్నరప్ గా నిలిచాడు.
News Posted: 29 January, 2010
|