సెరీనా విలియమ్సే విజేత మెల్ బోర్న్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్ ను డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సెరీనా విలియమ్స్ మరోసారి గెలుచుకుంది. మెల్ బోర్న్ లో శనివారం ఇక్కడి రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన హోరాహోరీ టైటిల్ పోరులో సెరీనా తన ప్రత్యర్థి బెల్జియంకు చెందిన జస్టిన్ హెనిన్ పై 6-4, 3-6, 6-2 స్కోర్ తేడాతో టైటిల్ నిలబెట్టుకుంది. అమెరికాకు చెందిన నల్ల కలువ సెరీనా ఖాతాలో ఇది 12వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను ఐదవసారి గెలిచింది.
News Posted: 30 January, 2010
|