ధోనీ పడ్డాడు

దుబాయ్ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సోమవారం వన్డ్ మ్యాచ్ లలో ర్యాంకులను ప్రకటించింది. ఐసిసి విడుదల చేసిన తాజా ర్యాంకుల ప్రకారం గత ఏడాది నుండి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన నిలిచిన ధోనీ రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ హస్సీ ధోనీ స్థానాన్ని కైవశం చేసుకుని అగ్రస్థానానికి చేరాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో ధోనీ రాణిస్తే మళ్లీ నంబర్ వన్ స్థానానికి చేరుకోవచ్చు. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రం ఒక స్థానం పైకి ఎగబాకి 7వ ర్యాంకులో నిలిచాడు. ఆసీస్ కెప్టెన్ రికీ పాటింగ్ నాలుగు స్థానాలు కిందకు దిగజారి ఆరో ర్యాంక్ లో నిలిచాడు. సెహ్వాగ్ 9. యువరాజ్ 19, సురేష్ రైనా 20, విరాట్ కొహ్లీ 21 ర్యాంకులను దక్కించుకున్నాయి.
బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ కెప్టెన్ డానియల్ వెటోరి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారతీయ బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒక్కడే 6వ ర్యాంక్ తో కాస్త ముందు వరుసలో నిలిచాడు. జహీర్ ఖాన్ 21 వ స్థానంలో ఉన్నాడు. ఇక టీమ్ ల విషయంలో ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టకుంది. టీమ్ ఇండియా ద్వితీయ స్థానంలో సాగుతోంది. ఆల్ రౌండర్ల జాబితాలో యువరాజ్ కు టాప్ -5 స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీల్ ఆల్ హసన్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
News Posted: 1 February, 2010
|