దక్షిణాఫ్రికా బ్యాటింగ్ నాగపూర్ : ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియాతో శనివారం ఉదయం ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారతదేశంలో దక్షిణాఫ్రికా క్రెకెట్ జట్టు పర్యటనలో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్ లు జరుగుతాయి. టీమిండియా జట్టులో గాయాల నుంచి ఇంకా కోలుకోని వివిఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ తొలి టెస్ట్ మ్యాచ్ కు దూరంగా ఉండగా, బద్రీనాథ్, షాహ తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ లో ఆడుతున్నారు.
జట్ల వివరాలు :
భారత్ : ఎం.ఎస్. ధోనీ (కెప్టెన్ / కీపర్), సెహ్వాగ్, గౌతం గంభీర్, మురళీ విజయ్, సచిన్ టెండుల్కర్, బద్రీనాథ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, వృద్ధిమాన్ షాహ.
దక్షిణాఫ్రికా : గ్రేమ్ స్మిత్ (కెప్టెన్), ఆష్వెల్ ప్రిన్స్, హషిమ్ ఆమ్ల, జాక్విస్ కల్లిస్, ఎ.బి. డి విలియర్స్, జె.పి. డుమిని, మార్క్ బుచర్ (కీపర్), డేల్ స్టైన్, మోర్న్ మార్కెల్, పాల్ హారిస్, వేన్ పార్నెల్.
News Posted: 5 February, 2010
|