సౌతాఫ్రికా 558 డిక్లేర్ నాగపూర్ : ఇక్కడి విదర్భ క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతు తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆదివారంనాడు దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 558 పరుగు చేసి డిక్లేర్ చేసింది. 291 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆదివారం ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 267 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తొలి రోజు సెంచరీ సాధించిన హషిం ఆమ్లా ఈ రోజు కూడా బ్యాటింగ్ కొనసాగించి మొత్తం 675 బంతులు ఎదుర్కొని 253 పరుగులతో డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. నిన్న సెంచరీ చేసిన జాక్విన్ కల్లిస్ కూడా మొత్తం 351 బంతులు ఆడి 173 పరుగులు చేశాడు. డివిలియర్స్ 53, డుమిని 9, బౌచర్ 39 చేసి ఔటయ్యారు. భారత బౌలింగ్ లో తొలి రోజు రెండు వికెట్లు తీసిన జహీర్ ఖాన్ ఈ రోజు మరో వికెట్ తీసి మొత్తం మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సెహ్వాగా కు ఒక వికెట్ దొరికింది.
కాగా, దక్షిణాఫ్రికా డిక్లేర్ చేయడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఓపెనర్లు గౌతం గంభీర్ 12 పరుగులతోను, సెహ్వాగ్ 9 పరుగులతోను నైట్ వాచ్ మెన్ గా ఉన్నారు.
News Posted: 7 February, 2010
|